విమాన ప్రయాణికులకు SHOCK

విమాన ప్రయాణికులకు SHOCK

విమాన ప్రయాణికులకు ఇంధన సర్‌ఛార్జీల భారం పడనుంది. ఇప్పటికే ఎయిరిండియా అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. ఇదే బాటలో ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ కూడా ధరలను పెంచాలని యోచిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో విమాన ఇంధన(ATF) ధరలు పెరగడంతో, ఆ భారాన్ని ప్రయాణికులపై వేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. దీనివల్ల వేసవి సెలవుల్లో విమాన ప్రయాణం మరింత ఖరీదైనదిగా మారనుంది.