ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
KMM: నెలవారీ తనిఖీలో భాగంగా మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని EVM గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్ సందర్శించారు. అనంతరం ఇవీఎం గోడౌన్ సీళ్, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర సైరన్, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టుల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.