VIDEO: సింగరాయకొండలో శ్రీరామ నవమి వేడుకలు

VIDEO: సింగరాయకొండలో శ్రీరామ నవమి వేడుకలు

ప్రకాశం: సింగరాయకొండలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని తరించారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.