జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక 'పొగాకు' పంట..!
ELR: ఆసియాలోనే ప్రధాన పొగాకు వేలం కేంద్రాలలో జంగారెడ్డిగూడెం పొగాకు కేంద్రం ఒకటి. ఇక్కడి మెట్ట భూముల్లో పండే 'వర్జీనియా' రకం పొగాకుకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి రష్యా, చైనా, యూరప్ దేశాలకు ప్రతి ఏటా కొన్ని వేల టన్నుల పొగాకును ఎగుమతి అవుతోంది. రూ.వేల కోట్ల టర్నోవర్తో ఈ ప్రాంతం జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తోంది. నాణ్యమైన ఈ పొగాకు పంట రైతులకు వరంగా మారింది.