ఎమ్మెల్యే బండారు నేటి పర్యటన వివరాలు
కోనసీమ: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఆలమూరు గ్రామంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.