VIDEO: గుడివాడలో కూటమి శ్రేణుల సంబరాలు
కృష్ణా: ఏపీ రాజధాని అమరావతి బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందడంపై గుడివాడలో కూటమి శ్రేణుల సంబరాలు చేశారు. ప్రజావేదిక కార్యాలయం నుంచి నెహ్రూ చౌక్ సెంటర్ వరకు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ కూటమి నాయకులు ర్యాలీ నిర్వహించారు. రైతుల త్యాగాలకు న్యాయం నేడు ఓ చారిత్రాత్మక రోజు అన్నారు. 12 ఏళ్లుగా రాజధానిపై అస్పష్టత వల్ల అభివృద్ధి, పెట్టుబడులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు.