టమాట పొలంలో వజ్రం లభ్యం

టమాట పొలంలో వజ్రం లభ్యం

KRNL: తుగ్గలి మండలం దిగువచింతల కొండకు చెందిన ఓ యువతి ఆదివారం తన టమాట పొలంలో కలుపు తీస్తుండగా వజ్రం కనబడింది. స్థానికులు వెంటనే విషయం తెలిపింది. స్థానికుల సమాచరం మేరకు వజ్రాల వ్యాపారులు ఆ వజ్రాన్ని కొనుగోలు చేయడానికి బేరం మొదలు పెట్టారు. వజ్రం పరిమాణం, విలువ ఇంకా ఖచ్చితంగా నిర్ధారించలేదు. తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లో వజ్రాల వేటకు వివిధ ప్రాంతాల నుంచి జనం వస్తుంటారని తెలిపారు.