నేడు ఒంగోలుకు రానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

నేడు ఒంగోలుకు రానున్న బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు

ప్రకాశం: మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చేపట్టిన బస్సు యాత్ర సోమవారం ఒంగోలుకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నట్లు జిల్లా బీజేపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు బస్సుయాత్ర ఒంగోలుకు చేరుకుంటుందని కార్యకర్తలు జయప్రదం చేయాలన్నారు.