అత్యధిక అవార్డులు సాధించిన జిల్లా ఆసుపత్రి
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో అత్యధిక అవార్డులు దక్కించుకుంది. మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా సూపరింటెండెంట్ డా. శ్రీధర్ బెస్ట్ సూపరింటెండెంట్, బెస్ట్ సివిల్ సర్జన్, బెస్ట్ అనస్తిటిస్టు అవార్డులు అందుకోనున్నారు. ఆరోగ్య శ్రీ కేసుల్లో ప్రథమ స్థానం, అత్యధిక రక్త పరీక్షలు నిర్వహించినందుకు, రేడియాలజీలో అవార్డు దక్కింది.