జలాల పెంపుపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్
పల్నాడు జిల్లాలో 'నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. గ్రామాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పెంపుపై చేపట్టాల్సిన పనులపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ‘జలధార’ తరహాలో కరువు నివారణకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.