పాడుదుమా స్వేచ్ఛా గీతం పుస్తకావిష్కరణ

VZM: సాహిత్యం కళలకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తానని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రముఖ కవి గంటేడ గౌరి నాయుడు రాసిన "పాడుదమా స్వేచ్ఛా గీతం" అనే పుస్తకాన్ని, జడ్పీ ఛైర్మన్ ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సాహిత్యాన్ని, కళలను భవిష్యత్ తరాలకి అందించాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు.