VIDEO: త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని 5వ వార్డులో మిషన్ భగీరథ పైప్‌లైన్ నెల రోజులుగా పగిలి వేల లీటర్ల తాగునీరు వృథా అవుతోంది. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు తెలిపినా స్పందన లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే పైప్ మరమ్మత్తు చేయించాలని అధికారులను ఇవాళ స్థానిక ప్రజలు కోరుతున్నారు.