2 కోట్ల విలువైన వైద్య పరికరాలు ప్రారంభం

SKLM: పలాస కిడ్నీ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత సులభతరం చేసేందుకు రూ.2 కోట్ల నిధులతో సమకూర్చిన నూతన పరికరాలను గురువారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. కిడ్నీలో రాళ్లతో పాటు వివిధ రకాల ఆపరేషన్లను కత్తెర లేకుండా అత్యాధునిక పరికరాలను ఉపయోగించి శస్త్ర చికిత్స చేయొచ్చని ఆమె తెలిపారు. కిడ్నీ ఆసుపత్రిని రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.