ACB కి చిక్కిన విద్యుత్ శాఖ AE

ACB కి చిక్కిన విద్యుత్ శాఖ AE

VZM: మక్కువ విద్యుత్‌ శాఖ AE జోగినాయుడు లంచం తీసుకుంటూ గురువారం ACB కి చిక్కారు. విజయనగరానికి చెందిన రైతు బి.నరసింహారాజు తన వ్యవసాయ భూమిలో మోటార్‌ కోసం కనెక్షన్‌ మంజూరుకు దరఖాస్తు చేసుకోగా AE 17 వేలు లంచం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మక్కువ విద్యుత్‌ కార్యాలయంలో రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ACB DSP రమణమూర్తి తెలిపారు.