డ్రగ్స్ రహిత సమాజం కోసం దండి మార్చ్

డ్రగ్స్ రహిత సమాజం కోసం దండి మార్చ్

E.G: నిడదవోలు నియోజకవర్గ సమిశ్రగూడెం వికాస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 నిర్వహించారు. సుమారు 300 మంది విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ మానవహారంగా ఏర్పడి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నినదించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.