SC, ST అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యుడికి సన్మానం

SC, ST అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యుడికి సన్మానం

మంచిర్యాల జిల్లా SC, ST అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఇటీవల ఎన్నికైన దుర్గం ఎల్లయ్యను BJP రాష్ట్ర నాయకులు కొయ్యల ఏమాజి, గోమాస శ్రీనివాస్ ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. దళితుల సమస్యల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎల్లయ్యను ఆ పదవిలో నియమించడం హర్షణీయం అన్నారు. అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం కృషి చేయాలన్నారు.