ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్

PDPL: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇవాళ ఆయన సమీకృత కలెక్టరేట్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, అధికారులు పాల్గొన్నారు.