కొత్త బస్సులపై దృష్టి సారించని ఆర్టీసీ

కొత్త బస్సులపై దృష్టి సారించని ఆర్టీసీ

HYD: నగరంలో పదేళ్ల క్రితం సిటీ బస్సులు ఎన్ని ఉన్నాయో.. ఇప్పుడూ అన్నే ఉన్నాయి. అదనంగా ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. ప్రస్తుతం తిరుగుతున్న కొత్త బస్సులు పాడైపోయిన బస్సుల స్థానంలో వచ్చినవే. నగరంలోని 28 బస్ డిపోల పరిధిలో దాదాపు 2,800 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రద్దీకి బస్సులు 100% నిండిపోతున్నాయి. దీంతో సీట్ల కోసం జనం అవస్థలు పడుతున్నారు.