అమ్మవారి ఒడి బియ్యం హుండీ కానుకల లెక్కింపు

నిర్మల్: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అమ్మవారి ఒడి బియ్యం హుండీ కానుకలను గురువారం ఆలయ సిబ్బంది లెక్కించారు. అధికారుల సమక్షంలో హుండీలను విప్పారు. ఓడి బియ్యం 55 క్వింటాళ్లు, ఎండు కొబ్బరి 319 కిలోలు, బరడి పోకలు 23 కిలోలు, పసుపు కొమ్ములు 65 కిలోలు, బాదం 14 కిలోలు, ఖర్జూర పండ్లు 39 కిలోలు వచ్చాయని ఆలయ ఈవో విజయరామారావు తెలిపారు.