యువకుడు అదృశ్యం

యువకుడు అదృశ్యం

MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన పోటరీ నగేష్ (35) అదృశ్యమైనట్లు ఎస్సై శివానందం తెలిపారు. ఇస్లాంపూర్‌కి చెందిన నగేష్ ఈనెల 1న రాత్రి భార్యతో కుటుంబ సంసార విషయంలో గొడవ పడి బయటకు వెళ్లిపోయాడు. బయటకు వెళ్లిన నగేష్ ఆచూకీ కనిపించకుండా పోవడంతో బంధువులు చుట్టుపక్కల వెతికారు. ఈ మేరకు తల్లి లక్ష్మి గురువారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.