ఘనంగా శ్రీ గంగానమ్మ తల్లి వార్షికోత్సవం
NTR: విజయవాడ రూరల్ మండలం, పైడూరుపాడు గ్రామంలో గురువారం శ్రీ గంగానమ్మ తల్లి 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆయన శ్రీ గంగానమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.