ప్రధాని పర్యటన భద్రత ఏర్పాట్లపై సమీక్ష

కృష్ణ: ప్రధాని మోదీ విజయవాడ పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై డీసీపీ సరిత సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో భద్రత ఏర్పాట్లపై ఆమె పలు సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ మళ్లింపు, ప్రధాని వచ్చే సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకోవాలని చెప్పారు.