కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములు వర్ధంతి

కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములు వర్ధంతి

ASR: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రరాష్ట్ర సాధనకై 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష గావించి, చివరకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. నిష్కలంక దేశభక్తి, ఆ మహనీయుని త్యాగఫలమే నేడు ఆంధ్రరాష్ట్ర అవతరణకు మూలం అని తెలిపారు.