'కార్మిక శాఖ కార్యాలయంలో పోస్టులు భర్తీ చేయాలి'

WNP: జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.రాజు డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఏఎల్డీలను నియమించాలని, కంప్యూటర్ ఆపరేటర్ సేవలను ఇతర జిల్లాలకు ఉపయోగించవద్దని కోరారు. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.