మహిళా క్రికెట్ జట్టుకు జగన్ అభినందనలు
AP: ఐసీసీ మహిళల ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కి చేరిన భారత మహిళా జట్టుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడాన్ని ఆయన అభినందించారు. ఈ సెమీస్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మహిళా జట్టు ఫైనల్‌లో కూడా అలాగే రాణించాలని జగన్ ఆకాంక్షించారు.