సింగరేణి నిర్లక్ష్యం వల్లే కార్మికుడి మృతి
PDPL: సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జేఎన్టీయూ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవీ.రావు ఆరోపించారు. సెంటినరీకాలనీ నుంచి వస్తున్న సింగరేణి కార్మికుడు ఎ.సంతోష్, రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా ప్రమాదానికి గురై మృతిచెందాడని ఆయన తెలిపారు. దీనికి సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఘటన స్థలాన్ని పరిశీలించారు.