శ్రీశైలంలో నందీశ్వర స్వామికి అభిషేక పూజలు

శ్రీశైలంలో నందీశ్వర స్వామికి అభిషేక పూజలు

NDL: శ్రీశైల మహా క్షేత్రంలో కొలువైన శనగల బసవన్న (నందీశ్వర స్వామి)కి ప్రదోషకాల అభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు నందీశ్వర స్వామికి పాలాభిషేకం, పంచామృత అభిషేకం, విశేష అర్చనలు చేపట్టారు. వివిధ ప్రాంతాల భక్తులు ప్రత్యక్ష, పరోక్ష సేవల ద్వారా నందీశ్వర అభిషేకంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.