వేదిక్ మాథ్స్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ..!
KDP: జాతీయ స్థాయి అబాకస్, వేదిక్ మాథ్స్ పోటీలు ఆదివారం హైదరాబాద్‌లోని PNM ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సింహాద్రిపురంకి చెందిన విద్యార్థిని ప్రథమ స్థాయిలో ప్రతిభ కనబరిచి రూ.5000 బహుమతి పొందింది. ప్రశంసా పత్రం కూడా అందుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.