మానవత్వం చాటుకున్న బీసీ ఇందిరమ్మ
NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం ఎదుట గాజులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న కోటయ్య, వెంకటమ్మ దంపతుల దుకాణం నిన్న ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న బీసీ ఇందిరా రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.