సొంతింటి కల నిజం చేసిన కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే
KDP: జిల్లాలో ఇవాళ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం రూ. 250,000 నగదు మంజూరు చేస్తుందన్నారు. మొదటి విడతలో మైదుకూరు మున్సిపాలిటీలో 222 మందికి ఇళ్లు లేని పేదలకు ఇళ్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు.