VIDEO: రాష్ట్ర ప్రజల సంక్షేమమే సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే

ATP: రాష్ట్ర ప్రజల సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం అని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలో 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు రూ. 3000 పింఛను రూ. 4000 వరకు పెంచారన్నారు. అలాగే, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి తల్లికి వందనమిచ్చి ఆదుకున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు.