ప్రణాళికతో చదివితే ఉన్నత విజయాలు సాధించవచ్చు.. కేంద్ర మంత్రి

SKLM: విద్యార్థులు ప్రణాళికతో చదివితే ఉన్నత విజయాలు సాధించవచ్చని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ప్రజా సదన్‌లో విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ మేరకు ఎరన్న విద్యా సంకల్పం క్రింద 130 మంది డీఎస్సీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 700 మందికి ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు.