తండ్రి కూలి.. కొడుకు ఎస్సై

తండ్రి కూలి.. కొడుకు ఎస్సై

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని 1వ వార్డు జగ్గుశాస్త్రులపేటకు చెందిన హనుమంతు వరహాల నాయుడు ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సై ఫలితాలలో 400 మార్కులకు 247 మార్కులు సాధించి ఎస్సైకి ఎంపికయ్యారు. వరహాలనాయుడు తండ్రి రామారావు సాధారణ కూలి మేస్త్రిగా పనిచేస్తున్నారు. స్నేహితులు గ్రామస్తులు వరహాలనాయుడిని అభినందించారు.