చిల్వర్ పాఠశాలలోకి చేరిన వరద నీరు

చిల్వర్ పాఠశాలలోకి చేరిన వరద నీరు

MDK: అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి ఉన్నత పాఠశాల తరగతి గది, వంటగదుల్లోకి వరద నీరు చేరింది. గదుల్లో చేరిన నీటిని బకెట్ల సాయంతో బయటకు పారబోశారు. పాఠశాల జలదిగ్బంధంగా మారిపోయింది. పాఠశాలలోకి నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాళాలు పునర్నిర్మాణం చేసి సమస్య తీర్చాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.