దళితుల బహిష్కరణను ఖండించిన నాగార్జున

దళితుల బహిష్కరణను ఖండించిన నాగార్జున

NLG: చిట్యాల మండలంలో ఒక దళిత యువకుడు బీసీ యాదవ యువతిని వివాహం చేసుకున్నారనే కారణంతో, యాదవ సంఘం దళితులను సామూహికంగా బహిష్కరించి, డప్పు కొట్టడానికి, కూలీ పనులకు పిలవకూడదని తీర్మానించింది. ఈ చర్య దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఘోరమైన చర్య అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున ఖండించారు.