జిల్లా టాపర్ గా Jr. కళాశాల విద్యార్థిని

జిల్లా టాపర్ గా Jr. కళాశాల విద్యార్థిని

MDK: రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఇంటర్ ఫలితాల్లో జిల్లాస్థాయిలో సత్తా చాటింది. ఒకేషనల్ ఆఫీస్ అసిస్టెంటిషిప్ చదువుతున్న భార్గవి 1000 మార్కులకు గాను 957 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచినట్లు ప్రిన్సిపల్ హిమజ్యోతి తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో చదువుతూ జిల్లా మొదటి ర్యాంక్ సాధించిన భార్గవిని అధ్యాపకులు,తోటి విద్యార్థులు అభినందించారు.