'తప్పనిసరిగా ఆల్బెండజోల్ మతాలు వేసుకోవాలి'

ADB: 19 సంవత్సరాల లోపు విద్యార్థులు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సోనాల PHC వైద్యాధికారి నవీన్ రెడ్డి సూచించారు. సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అంగన్వాడి కేంద్రాలు , ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులకు మాత్రలను వేశారు.నులి పురుగుల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.