రేషన్ బియ్యం పంపిణీపై తహసీల్దార్ ఆదేశాలు
NGKL: రేషన్ డీలర్లు ప్రజలకు సకాలంలో సరకులు అందించాలని తహసీల్దార్ రాములు ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేయాలని, వంద శాతం eKYC పూర్తి చేయాలని సూచించారు. చనిపోయిన వారి పేర్లు తొలగించాలని, గడువు ముగుస్తున్నందున డీలర్లు తమ లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవాలని స్పష్టం చేశారు.