మంటాలార్పేందుకు వెళ్లి.. అంతలోనే..!

మంటాలార్పేందుకు వెళ్లి.. అంతలోనే..!

కృష్ణా: వీరులపాడు మండలం తాటిగుమ్మిలో నిన్న విషాద ఘటన చోటుచేసుకుంది. అచ్చమ్మ(62) అనే వృద్ధురాలు తన పొలంలో వ్యాపించిన మంటలను ఆర్పేందుకు వెళ్లగా, ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుని సజీవ దహనమయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.