నూకాంబిక దేవాలయంలో కళాకర్షణ పూజలు

నూకాంబిక దేవాలయంలో కళాకర్షణ పూజలు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అబిడ్స్ సెంటర్ లో గల శ్రీ నూకాంబిక దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాకర్షణ పేరుతో జరిగిన పూజా కార్యక్రమంలో అమ్మవారి మూల విరాట్ శక్తిని కలశంలో భద్రపరిచారు. నూతన ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి కలశంలో ఉన్న శక్తిని అమ్మవారి విగ్రహంలో పునః ప్రతిష్టిస్తారు.