నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాం:మంత్రి

MDK: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నూటికి నూరు శాతం రైతు రుణమాఫీ చేసి తీరుతామని జిల్లా ఇంఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ 'రైతు పండుగ' సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి రూ.18 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తు చేశారు.