ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
NZB: కమ్మర్‌పల్లి మండలoలో నేడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద ఆపార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. మండల ప్రజల తరఫున సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.