ఒంటిమిట్ట రామయ్య హుండీ ఆదాయం లెక్కింపు
KDP: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి హుండీ ఆదాయాన్ని మంగళవారం ఆలయ టీటీడీ అధికారులు లెక్కించారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 09 వరకు హుండీలోని కానుకలను లెక్కించినట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కింపులో రూ. 5,91,855 ఆదాయం వచ్చినట్లు ఆలయ టీటీడీ అధికారులు వెల్లడించారు.