బాలాయపల్లి పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ
TPT: బాలాయపల్లి పీఏసీఎస్‌లో బుధవారం యూరియా పంపిణీ జరిగింది. ఇందులో భాగంగా పీఏసీఎస్ ఛైర్మన్ రావి సత్యనారాయణ మాట్లాడుతూ.. బాలాయపల్లి సొసైటీ పరిధిలో యూరియా కొరత రాకుండా సరఫరా చేస్తామని తెలిపారు. అనంతరం కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ యూరియా అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.