వీపనగండ్లలో నాటు సారా పట్టివేత

వీపనగండ్లలో నాటు సారా పట్టివేత

WNP: వీపనగండ్ల మండల పరిధిలోని నాగర్ల బండ తాండ నుంచి తూముకుంట మధ్య ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం ఉదయం రూట్ వాక్ నిర్వహించారు. అదే సమయంలో నెంబరు లేని హీరో హెచ్ఎఫ్ డీలక్స్ పై వస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని సోదాల చేయగా అతని వద్ద 10 లీటర్ల నాటు సారా లభ్యమయింది. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి బైక్‌ను సీజ్ చేసినట్లు DPEO శ్రీనివాసులు తెలిపారు