'సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
KRNL: గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ భార్గవి వార్షిక తనిఖీ సందర్భంగా సందర్శించారు. అనంతరం ఇవాళ సీఐతో నేరాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియాతో ఆమే మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసపోతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.