బందర్ బీచ్‌కు రూ.120 కోట్లు..?

బందర్ బీచ్‌కు రూ.120 కోట్లు..?

NTR: రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సుమారు రూ.915 కోట్ల వ్యయంతో చేపట్టే 9 కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలను మంత్రి కందుల దుర్గేశ్ కేంద్రానికి సమర్పించారు. మచిలీపట్నం బీచ్ రూ.120 కోట్లు, మంగళగిరికి రూ.95 కోట్లు, అరసవల్లి, లేపాక్షి, లంబసింగి వంటి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి షెకావత్‌ను ఆయన కోరారు.