VIDEO: పౌరాదేవి వద్దకు చేరి.. దీక్షలు విరమించి
ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి నుంచి మహారాష్ట్ర రాష్ట్ర పౌరాగఢ్ వరకు దీక్షాగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఇటీవల 'మహాసంకల్ప పాదయాత్ర' నిర్వహించారు. వేలాది మంది సేవాలాల్ దీక్షాపరులతో పౌరాదేవికి వెళ్లి శ్రీరామనవమిని పురస్కరించుకుని 41 రోజుల పాటు తీసుకున్న దీక్షను భక్తులు విరమించుకున్నారు. ముందుగా ప్రత్యేక పూజలు చేసి భోగ్ భండార్ సమర్పించారు.