బుడ్డి వలసలో తాగునీటి కష్టాలు

SKLM: సరుబుజ్జిలి మండలం చిన్న కాగితాపల్లి పంచాయతీ బుడ్డి వలస గ్రామంలో గత కొంతకాలంగా వాటర్ ట్యాంక్ పనిచేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ట్యాంక్ పూర్తిగా శిథిలమైందని చుట్టూ మురికి నీరుతో నిండిందని, ప్రస్తుతం తాగునీరుకు కష్టాలు పడక తప్పడం లేదన్నారు. సంబంధిత అధికారులకు తెలియజేసిన ఫలితం లేదని స్పష్టం చేశారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు.