'ప్రజావాణికి 369 దరఖాస్తుల స్వీకరణ'

'ప్రజావాణికి 369 దరఖాస్తుల స్వీకరణ'

KNR: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీలు పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. మొత్తం 369 మంది అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.